రైతులపై తేనెటీగల దాడి
ధాన్యం ఆరబోస్తూ రైతులు
కాంటాలు నిర్వహిస్తున్న హమాలీలు
తేనెటీగల దాడిలో పలువురు రైతులకు తీవ్ర అస్వస్థత
కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని ఐకేపీ సెంటర్లో రైతులపై తేనెటీగలు దాడి చేశాయి.మంగళవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.రైతులు ఐకేపీ సెంటర్ లో ధాన్యం ఆరపోస్తూ,వడ్లు కాంటాలు చేస్తూ హమాలీలు, నిర్వాహకులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా సెంటర్ పక్కన ఉన్న ఓ చెట్టు పైనుంచి తేనెటీగలు లేసి వచ్చి రైతులపై దాడి చేయగా పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. రైతు పేరటి దేవేంద్ర తీవ్ర అస్వస్థకు గురికాగా స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్ లో ఏంజీఎం ఆసుపత్రికి తరలించారు.


