బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం
కాకతీయ, ములుగు ప్రతినిధి : మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్‌కుమార్, టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత మంగళవారం ఏటూరునాగారం గ్రామపంచాయతీలో విస్తృత ప్రచారం జరిగింది. 3వ వార్డు సభ్యుడు బట్టు మానస, 9వ వార్డు సభ్యుడు గోపి పర్వతాలు ఎల్లయ్యతో కలిసి శ్రీలత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాకులమర్రి కుటుంబం గతంలో ఎన్నో సేవలు అందించింది అని, మా పిల్లల చికిత్స చేయించారు, మాకు ఇళ్లు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారూ అని,ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా అండగా నిలిచారు అని పలువురు ప్రజలు చెప్పినట్లు నాయకులు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్‌రావు, కూనూరు అశోక్, ఎండి. వలీబాబా, కోనేరు నాగేష్, తాడూరి రఘు, తూరం పద్మ, ప్రమీల, లలిత, సఫియా, సర్దార్ పాషా, వెంకట్రావు, నరసయ్య, కుమ్మరి చంద్రబాబు, గండేపల్లి నరసయ్య, బాస పుల్లయ్య, బాలకృష్ణ, బాసాని శేఖర్, బట్టు గోపి, పర్వతాలు ఎల్లయ్య, జాడి భోజరాజు, యలవర్తి శ్రీనివాసరావు, గుండారపు శీను, గుండారపు రాజు, తాండ్ర విజయ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది.


