ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా
బీఆర్ఎస్ గ్రామా పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్
కాకతీయ,ఆత్మకూరు : ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానని బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ ఆత్మకూరు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మృతుల కుటుంబాలకు మనోధైర్యం ఇచ్చారు. గ్రామా అభివృద్ధికై పాటుపడతానని గ్రామా ప్రజల సంక్షేమమే నా ధ్యాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి,నత్తి సుధాకర్,నాగెల్లి రాజు,వంగల భగవాన్ రెడ్డి,దార్గురి రమేష్ తదితరులు పాల్గొన్నారు..


