epaper
Tuesday, December 2, 2025
epaper

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

కాకతీయ, వరంగల్ సిటీ : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం పట్టణ పరిధిలోని బోడగుట్ట, సోమిడి వడ్డేపల్లి, లష్కర్ సింగారం, పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, హసన్ పర్తి, కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,98,000 ప్రభావిత గ్రూపులకు చెందిన వారిని పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించవలసి ఉండగా 1,30,049 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందనీ, స్క్రీనింగ్ తక్కువగా నిర్వహించిన వడ్డేపల్లి, లష్కర్ సింగారం, కడిపికొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను ఇందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేశంలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో టీబీ నియంత్రణ కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా స్క్రీనింగ్, ఎక్స్ రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన మొబైల్ ఎక్స్ రే మిషన్ ను పరిశీలించి ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే ఎక్స్ రే పరీక్షలు తక్కువగా నిర్వహించారో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ బాగానే చేస్తున్నప్పటికీ పట్టణ పరిధిలో మాత్రం చాలా తక్కువగా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బంది, వనరులతో టిబి ముక్త్ భారత్, ఎన్సిడి, మాతా శిశు సంక్షేమంతో పాటు ఇతర అన్ని ఆరోగ్య కార్యక్రమాలు లక్ష్యాలను సాధించాలని, లేనట్లయితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య టీబీ ముక్త్ భారత్, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్న ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు, ఆశాలవారీగా సమీక్షించి కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.100 శాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడానికి ప్రోత్సహించిన ఆరుగురు ఆశాలను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పీవోడిటి డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డెమో వి.అశోక్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం బీజేపీ...

మేడారం గ‌ద్దెల ప్రాంగ‌ణ నిర్మాణాల్లో పొర‌పాట్లు జ‌రుగొద్దు

మేడారం గ‌ద్దెల ప్రాంగ‌ణ నిర్మాణాల్లో పొర‌పాట్లు జ‌రుగొద్దు ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు...

రైతులపై తేనెటీగల దాడి

రైతులపై తేనెటీగల దాడి ధాన్యం ఆరబోస్తూ రైతులు కాంటాలు నిర్వహిస్తున్న హమాలీలు తేనెటీగల దాడిలో పలువురు...

లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు

లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కాక‌తీయ‌,...

చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి

చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి ప్రజలకు జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచన తడి...

బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం

బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా బీఆర్ఎస్ గ్రామా పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్ కాకతీయ,ఆత్మకూరు...

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని తెలంగాణ మోడల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img