అభాగ్యులకు రుద్ర ఫౌండేషన్ దాతృత్వం
చలిలో వణుకుతున్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
హన్మకొండలో పేరం గోపికృష్ణ మానవతా సేవ
కాజీపేట, హన్మకొండల్లో వందలాది మందికి అందజేత
కాకతీయ, హన్మకొండ : ఎవరి ఆదరణకు నోచుకోని అభాగ్యులకు రుద్ర ఫౌండేషన్ మానవతా సాయం అందజేసింది. చలిలో వణుకుతున్న నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేసింది. ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఫౌండేషన్ ప్రతినిధులు హన్మకొండ, కాజీపేట, వరంగల్‌లోని రోడ్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్, హన్మకొండలోని అంబేద్కర్ సర్కిల్, కేయూ క్రాస్ రోడ్డు, హన్మకొండ బస్‌స్టేషన్, పబ్లిక్ గార్డెన్, హన్మకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, వరంగల్ స్టేషన్ రోడ్డు, ఎంజీఎం ప్రాంతాల్లో వృద్ధులు, అనాథలకు, బిక్షులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా పేరం గోపికృష్ణ మాట్లాడుతూ.. మానవ సేవే.. మాధవ సేవ అని అన్నారు. అనాథలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. మానవతా విలువలను ముందుకు తీసుకెళ్తున్న రుద్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సతీష్, వివేక్, వీరాచారి, రాజ్ కుమార్, రాజు, శ్యామ్, అరుణ్, అభిషేక్, సునీల్, రాము, రామకృష్ణ, విక్రమ్, తిరుపతి, శివ, కుమారస్వామి, రుద్ర ఫౌండేషన్ సేవా బృందం, తదితరులు పాల్గొన్నారు.



