epaper
Tuesday, December 2, 2025
epaper

వైన్ షాపు పెట్టొద్దు..!

వైన్ షాపు పెట్టొద్దు..!
బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద మ‌హిళ‌ల‌ల నిర‌స‌న‌
నిరసనకు బీజేపీ నేత దేవకి వాసుదేవరావు మద్దతు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద ఉన్న కళా వైన్స్ కారణంగా స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రత సమస్యలపై మంగళవారం మహిళలు వైన్స్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి హాజరై మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎక్సైజ్ శాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వైన్స్ వల్ల మహిళలు, విద్యార్థినులు, గృహిణులు ఇళ్ల నుంచి బయటకి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల భద్రతను కాపాడాల్సిన సమయంలో ఈ అసౌకర్యం కొనసాగడం బాధాకరం అని ఆయన అన్నారు. మహిళల సమస్యపై ఒక్కమంత్రి కూడా స్పందన ఇవ్వకపోవడం ప్రజలపై అవమానకర చర్య అని అభిప్రాయపడ్డారు. పదవులు, పార్టీలు మార్చడంలో వేగంగా ఉండే మంత్రులు మహిళల భద్రత విషయంలో మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన విమర్శించారు.మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం… మహిళలు రోడ్డుకి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.గాంధీ సిద్ధాంతాలను నోటి మాటగా మార్చేసిన కాంగ్రెస్ పాలనలో, “ఆడవారు అర్ధరాత్రి కూడా భయపడకుండా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం” అని చెప్పుకునే కాంగ్రెస్ ఈరోజు ఖమ్మంలో పగలప్పుడే మహిళలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి తెచ్చిందని ఆయన విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ మహిళల భద్రతకు సంబంధించిన చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడిందని, ముగ్గురు మంత్రులు ఉన్నట్టా? లేక లేనట్టా? అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా, రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మంకు రెండు కొత్త వైన్స్ లు మాత్రం ఇచ్చిందని ఆయన విమర్శించారు.
మహిళల భద్రత, గౌరవం విషయంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళా వైన్స్‌ను తరలించాలని డిమాండ్ చేశారు. మహిళల సమస్యను తక్కువగా తీసుకుంటే ప్రజలతో కలిసి బలమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలుకొంపర్ల సురేఖ, దొడ్డ అరుణ, మంద సరస్వతి,కొణతం లక్ష్మీనారాయణ, శాసనాల సాయిరాం, గడీల నరేష్, ఆర్ వి ఎస్ యాదవ్, వాకదాని రామకృష్ణ, పాలెపు జంగిలి రమణ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు

నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు...

పాలేరులో కాంగ్రెస్ జోరు

పాలేరులో కాంగ్రెస్ జోరు హస్తం గూటికి బీఆర్ఎస్ కుటుంబాలు కాకతీయ,ఖమ్మం రూరల్‌ : గ్రామ...

డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులను నమ్మొద్దు

డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులను నమ్మొద్దు అడిషనల్ డీసీపీ రామానుజం ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్"...

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్...

ఖ‌మ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు

ఖ‌మ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ...

31 మంది బెల్ట్ షాపులు నిర్వాహాకుల బైండోవ‌ర్

31 మంది బెల్ట్ షాపులు నిర్వాహాకుల బైండోవ‌ర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు అన్న‌దాత‌ల‌కు అండగా ఉంటా...

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img