నందిగామలో బీజేపీ–బీఆర్‌ఎస్ నాయకుల కాంగ్రెస్ తీర్థం
ఎమ్మెల్యే దొంతి సమక్షంలో పార్టీలో చేరికలు
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ప్రముఖ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ఆకర్షణగా మారడంతో నందిగామ గ్రామ బీజేపీ అధ్యక్షుడు చెట్టుపల్లి విజేందర్, మోర్తాల మనోహర్‌రావు, మర్రి నాగరాజు, పార్టీ నాయకులు గుగులోతు బిక్షపతి, భూక్య ప్రభాకర్, బీజేపీ యూత్ అధ్యక్షుడు మేడిపల్లి ప్రవీణ్, కానిగంటి రాజు, దూడల శ్రీనివాస్, చిట్యాల హరికోటి, కానిగంటి అశోక్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిన నాయకులకు కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ… “ప్రజల నమ్మకం, మంచి పాలన కాంగ్రెస్ పార్టీ బలం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జంగిలి మోహన్, నల్లబెల్లి మండల మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘుపతిరావు, సిద్దురి తిరుపతిరావు, సమ్మయ్య నాయక్, నందిగామ మాజీ సర్పంచ్ దూడల సుమన్, మాజీ వార్డు సభ్యులు చిట్యాల సురేష్, భూక్యా భాస్కర్, మూడు స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


