ఫైనల్ కు చేరిన వరంగల్ జట్టు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : సిరిసిల్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 8వ జిల్లా వాలీబాల్ క్రీడల్లో వరంగల్ జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. మహబూబ్‌నగర్ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ మీరిపెల్లి రాజు, కోచ్ జీవన్, యాదిరెడ్డి, బాబు, రఘువీర్, తీగల శ్రీనివాస్ తదితరులు జట్టు సభ్యులను అభినందించారు.


