యువతి పై కెమికల్ రసాయనంతో దాడి…
కాకతీయ, వరంగల్ సిటీ : కడిపికొండ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం ద్విచక్ర వాహనం పై వెళ్తున్న యువతి పై కెమికల్ రసాయనంతో దాడి చేసిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సునంద (21) అనే జాఫర్గడ్ వెంకటాపురం కి చెందిన యువతి పై కెమికల్ రసాయనంతో దాడి చేయగా బాధితురాలకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే స్థానికులు, బంధువులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బీసీ నర్సింగ్ చదువుతున్న యువతి హాల్ టికెట్ నిమిత్తం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని ద్విచక్ర వాహనం పై వస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఎంజీఎం లో చికిత్స పొందుతున్న బాధితురాలు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కాజీపేట పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



