epaper
Monday, March 2, 2026
epaper

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!
ఒక్కో డివిజన్ కు 50లక్షలు ఇస్తున్నాం..
పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డివిజన్లకు ఎక్కువ!
వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు
బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే నాయిని వెల్లడి
త్వరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ప్రకటన
భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరణ

కాకతీయ, వరంగల్ : గతంలో ఎన్నడు లేనంతగా గడిచిన రెండేళ్లలో వరంగల్ నగర అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పడంలో తడబడ్డారు. సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న రూ. 5భోజనానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం ఒక్కో డివిజన్ అభివృద్ధి కోసం రూ. 50లక్షలు కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వరద ముంపు బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నిధుల వివరాల్లో తడబాటు..

అధిక మొత్తంలో తెచ్చిన నిధులు వివరాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా ఎమ్మెల్యే నాయిని తడబడ్డారు. ఆ వివరాలు కచ్చితంగా తెలియదని, మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని పేర్కొనడం గమనార్హం. ఒక్కో డివిజన్ కు రూ.50లక్షలు కేటాయించగా, హన్మకొండ ఎమ్మెల్యే పరిధిలోని కొన్ని డివిజన్లకు కోటికిపైగా నిధులు ఎలా కేటాయించారని ప్రశ్నించగా, అక్కడ కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువు విస్తీర్ణం 360 ఎకరాల నుంచి 130 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇక నగరంలో ముంపు నివారణ కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ నిర్మిస్తామని, త్వరలో ఆ పనులు ప్రారంభిస్తామని నాయిని వెల్లడించారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసహనం
కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం వచ్చిన ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు వస్తున్నారా? లేదా వారితో ముప్పు ఉందా అంటూ నిలదీశారు. కౌన్సిల్ సమావేశంలో చాకలి ఐలమ్మ భవనానికి నిధులు కేటాయించలేదని ఈ జెండా ప్రతులను చించి ఎగరేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశం అనంతరం కూడా ఆయన్ను మాట్లాడాలని విలేకరులు కోరగా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఆయన్ను కారులో ఎక్కించి పంపించారు. దీంతో ఆయన్ను మాట్లాడకుండా చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అబ్బనికుంట వాసుల నిరసన

కౌన్సిల్ సమావేశం వేళ అబ్బనికుంటవాసులు బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అబ్ద్బనికుంటలో రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా, అర్ధంతరంగా వదిలేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన మహిళలు, మధ్యాహ్నం 3గంటలకు కూడా సమావేశం ముగిశాక తమ నిరసనను వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్ సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం...

కొమ్మాల జాతరపై డేగ కన్ను

కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు...

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం రాజబోయిన రాము...

పారిచోద్యం..!

పారిచోద్యం..! వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త‌ నామమాత్రంగా చెత్త సేకరణ… అస్తవ్యస్తంగా పారిశుధ్యం వీధుల్లో గుట్ట‌లుగా చెత్త...

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి లంబాడి తండా కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ పోరిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img