epaper
Monday, December 1, 2025
epaper

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!
కోయంబత్తూరులో క్రూరహత్య
ముగ్గురు పిల్లల తల్లిని కిరాతకంగా నరికి చంపిన భర్త
భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేట‌స్‌

కాక‌తీయ‌, క్రైమ్‌: తమిళనాడులోని కోయంబత్తూరులో భయంకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, కోపం, అసహనం చివరకు రక్తపాతానికి దారితీసిన ఈ ఘటనలో భర్త చేసిన కిరాతకానికి యావ‌త్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిప‌డింది. భార్యను నరికి చంపడమే కాకుండా, ఆమె మృతదేహం పక్కనే కూర్చుని సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం ఈ ఘ‌ట‌న‌ను మరింత దారుణంగా మార్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్ మరియు శ్రీప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. నిత్యం గొడవలు, మాటల తగాదాలు పెరగడంతో శ్రీప్రియ భర్త నుంచి దూరంగా ఉంటూ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అక్క‌డే ఓ మహిళల హాస్టల్‌లో నివాసం ఉంటోంది. ఈ క్ర‌మంలోనే భర్త బంధువు ఇసక్కి రాజాతో శ్రీప్రియకు పరిచయం ఏర్ప‌డింది.

శ్రీప్రియతో దిగిన ఫోటోను రాజా త‌న‌ వాట్సాప్ స్టేటస్‌లో పెట్ట‌గా.. ఈ ఫోటోను చూసిన బాలమురుగన్ తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యాడు. రాజాతో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమాన‌మే నిండి ప్రాణాన్ని బ‌లితీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం మాట్లాడాలి అన్న నెపంతో హాస్టల్‌కు వచ్చిన బాలమురుగన్, బట్టల్లో దాచుకున్న కొడవలిని బయటకు తీసి భార్యపై దాడి చేశాడు. అక్కడికక్కడే నరికి చంపేశాడు. కానీ అతని క్రూరత్వం అక్కడితో ఆగలేదు.

రక్తపు మడుగులో పడి ఉన్న భార్య మృతదేహం పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకుని, “నమ్మక ద్రోహానికి ప్రతిఫలం మరణం’’ అనే క్యాప్షన్‌తో తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. ఈ క్రూరహత్యతో హాస్టల్‌లో ఉన్న మహిళలు భయంతో బయటికి పరుగులు తీశారు. నిందితుడు మాత్రం అక్కడే ప్రశాంతంగా కూర్చొని, పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న రత్నపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలమురుగన్‌ను అరెస్టు చేశాకె, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు న‌మోదు చేశారు. కోయంబత్తూరులో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు?

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు? మెడికవర్ ఆస్పత్రిలో పేషెంట్ మృతిపై...

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్ కాకతీయ, ములుగు ప్రతినిధి...

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కాకతీయ, జనగామ : జనగామ...

బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌

బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌ కాకతీయ తొర్రూరు : మహబూబాబాద్...

ఏసిబి అధికారి వేషం వేసి దందా..

న‌కిలీ ఏసీబీ అధికారి అరెస్టు ప్ర‌ధాన నిందితుడి రాచంప‌ల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో...

అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్

అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాయపర్తి గ్రామంలో...

చావు క‌బురు చ‌ల్ల‌గా..! వ‌రంగ‌ల్‌లో మ‌రో మెడికిల్‌..!?

చావు క‌బురు చ‌ల్ల‌గా..! వ‌రంగ‌ల్‌లో మ‌రో మెడికిల్‌..!? వైద్యం అంద‌జేస్తున్న‌ట్లుగా నాట‌కమాడారు..! బిల్లు పే చేయాలంటూ...

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img