ఖమ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అదేవిధంగా అర్ధరాత్రి సమయాల్లో తీరుగుతున్న అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను పోలీస్ అధికారులు తనిఖీ చేస్తున్నారని తెలిపారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో వుంటాయాని, అందులో భాగంగానే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు.అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి , రేషన్ బియ్యం, ఇసుక వంటి అక్రమ రవాణా కట్టడి చేసేలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు.


