తిమ్మాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ గ్రామానికి మార్పు తీసుకురావాలంటే బిజెపికి అవకాశం ఇవ్వాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చెప్పారు. సర్పంచ్‌గా పార్టీ అభ్యర్థి తక్కిటి దేవేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మండల కేంద్రంగా ఉన్న తిమ్మాపూర్ ఏ అభివృద్ధి చూడలేకపోయింది. గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు స్వప్రయోజనాలకే పనిచేశారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులూ కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లే జరుగుతున్నాయి అన్నారు.తిమ్మాపూర్ దశ–దిశ మార్చగల శక్తి బిజెపికే ఉందని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో దేవేందర్ రెడ్డికి ప్రజలు ఆశీర్వాదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మాజీ ఎంపిటిసి ఎడ్ల జోగిరెడ్డి, నాయకులు డిష్ రవి, రాజేందర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి కొత్తగా చేరిన తక్కిటి మధుసూదన్ రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, మదన మహేష్ చంద్ర, కొండ నాగరాజు, కసాడి కుమార్, అనిల్ తదితరులకు నాయకులు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు.


