“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాలకు బిగ్ హైప్!
మోడీ కాల్‌తో వెడ్డింగ్ బూమ్
మన్ కీ బాత్‌తో ట్రెండ్ అయిన వెడ్ ఇన్ ఇండియా
ఇండియాలో టాప్ 10 డ్రీమ్ డెస్టినేషన్స్ ఇవే
కాకతీయ, నేషనల్ డెస్క్ : డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ గత కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. కానీ తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఆ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా దేశం వైపు తిరుగుతోంది. “వెడ్డింగ్ కోసం విదేశాలు ఎందుకు? భారత్‌లోనే ప్రపంచ స్థాయి డెస్టినేషన్స్ ఉన్నాయి… వెడ్ ఇన్ ఇండియాను ప్రోత్సహించండి” అని మోడీ చెప్పడంతో ట్రావెల్ పోర్టల్స్, రిసార్ట్స్, ఈవెంట్ కంపెనీలు మంచి స్పైక్‌ను రిపోర్ట్ చేస్తున్నాయి. వివాహాల కోసం భారతీయ డెస్టినేషన్స్‌పై సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. దేశీయ టూరిజం, హోటల్ ఇండస్ట్రీకి ఇది భారీ ఊపునిస్తోంది. ముఖ్యంగా రాయల్, బీచ్, నేచర్, హెరిటేజ్ థీమ్ వెడ్డింగ్స్‌కి ఇప్పుడు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో అత్యధిక హైప్ అందుకుంటున్న ఇండియాలోని టాప్ 10 డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ గమనిస్తే..
ఉదయ్‌పూర్, రాజస్థాన్: ప్యాలెస్‌లు, సరస్సులు, పౌరాణిక కోటలు… రాజసంగా కలల పెళ్లి అనుకుంటే ఉదయ్‌పూర్ కంటే బెస్ట్ ఆప్షన్ లేదు. మోడీ పిలుపు తర్వాత ఇక్కడ రిసార్ట్ బుకింగ్స్ మరింతగా పెరిగిపోయాయి.
శిమ్లా, హిమాచల్ ప్రదేశ్: ప్రకృతి మధ్యలో సింపుల్ కానీ డ్రీమీ వెడ్డింగ్ కోరుకునే వారికి శిమ్లా హాట్ ఫేవరెట్. ఢిల్లీ మరియు దాని సమీప ప్రాంతాల్లో నివసించే వారు వివాహ వేడుకలు చేసుకునేందుకు షిమ్లా ఎంతో అనువైన ప్రదేశం.
గోవా: సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్, అరేబియా సముద్రపు అలలు, వైట్ శాండ్ సాక్షిగా బీచ్ వెడ్డింగ్ ప్లాన్ చేసే జంటలకు గోవా ఎప్పుడూ నంబర్ వన్ ప్లేస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
హావ్‌లాక్ ఐలాండ్, అండమాన్: టర్కాయిస్ నీళ్లు, శుభ్రమైన బీచ్‌లు, ప్రైవేట్ రిసార్ట్స్… ఇది ఇండియాలో ఉన్న అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్ స్పాట్. అదేవిధంగా ఇండియన్ మాల్దీవ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కపుల్స్‌కి ఇది ఇప్పుడు మోస్ట్ సెర్చ్‌డ్ లొకేషన్.
నైనిటాల్, ఉత్తరాఖండ్: ప్రశాంతత, లేక్ వ్యూ, అందమైన పర్వత ప్రాంతాల్లో మధ్యలో ఎలిగెంట్ వెడ్డింగ్ కోరుకునేవారికి నైనిటాల్ ఇప్పుడు టాప్ ట్రెండ్.
ఆగ్రా, ఉత్తర్‌ప్రదేశ్: ప్రేమకు ప్రతీక అయిన తాజ్ బ్యాక్‌డ్రాప్‌లో పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఇష్టపడుతున్నారు. రొమాంటిక్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసే జంటలకు ఇది బెస్ట్ లొకేషన్.
జురాహో, మధ్యప్రదేశ్: యునెస్కో వారసత్వ దేవాలయాలు, అందమైన శిల్పాలు జురాహో నగరంలో ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక రిచ్ కల్చరల్ వైబ్‌ను కలిగిన నగరం ఇది. ట్రాడిషన్–కల్చర్ థీమ్ వెడ్డింగ్స్‌కు ఖజురాహో పర్ఫెక్ట్ డెస్టినేషన్.
కోవలం, కేరళ: దక్షిణ భారతంలో బీచ్ వెడ్డింగ్ అనుకుంటే కోవలం మస్ట్ పిక్. లైట్‌హౌస్, గ్రీన్ కోస్టు, వేవ్ సౌండ్స్ అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి.
జోధ్‌పూర్, రాజస్థాన్: మెహరంగఢ్ ఫోర్ట్, బ్లూ సిటీ వైబ్స్, రాయల్ సెట్టింగ్స్‌తో జోధ్‌పూర్ భారీ స్కేల్ వెడ్డింగ్స్‌కు సూపర్ హాట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. బిగ్ ఫ్యాట్ రాయల్ వెడ్డింగ్ ను కోరుకునేవారు జోధ్‌పూర్ ను ఎంపిక చేసుకోవచ్చు.
హిమాలయన్ వ్యాలీ: మోడీ ప్రత్యేకంగా సూచించిన హిమాలయ లోయ ఇప్పుడు ట్రెండ్. మనాలి, కుల్లు, ధర్మశాల లాంటి ప్రదేశాలు మంచు కప్పిన కొండలతో మ్యాజికల్ అంబియన్స్ ఇస్తాయి. క్లౌడ్స్ మధ్య పెళ్లి చేసుకునే అనుభవమే వేరే లెవల్.


