చావు కబురు చల్లగా..!
వరంగల్‌లో మరో మెడికిల్..!?
వైద్యం అందజేస్తున్నట్లుగా నాటకమాడారు..!
బిల్లు పే చేయాలంటూ ఒత్తిడి చేశారు0
బిల్లు పే చేసే క్రమంలోనే రోగి చనిపోయినట్లుగా ప్రకటించారు
మెడికవర్‌లో ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
మెడికవర్ ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రీపిట్
కాకతీయ, వరంగల్ : నిర్లక్ష్యంగా వైద్యం అందజేసి రోగి ప్రాణాలు బలిగొన్నారని పేర్కొంటూ వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి మండలం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన ప్రభాకర్ సమ్మయ్యను బంధువు ఆదివారం సాయంత్రం మెడికవర్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. అత్యవసర విభాగంలో జాయిన్ చేయించిన వైద్య సిబ్బంది.. వైద్య సేవల కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పడంతో.. కొంత అమౌంట్ కట్టి.. మిగతా అమౌంట్ తయారు చేసుకోవాలని చెప్పారు.ఆ ప్రకారమే బంధువులు బిల్లు పే చేశారు. బిల్లు చెల్లింపు ప్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికే రోగి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని బంధువులకు తెలియజేసి.. హైదరాబాద్‌లోని మరో కార్పోరేట్ ఆస్పత్రికి తరలించాలని వెల్లడించారు. బంధువులకు చెప్పిన కొద్దిసేపట్లో పేషంట్ చనిపోయినట్లుగా నిర్ధారణ చేయడం గమనార్హం.
డబ్బలు కోసమే వైద్యం నాటకం..! బంధువుల ఆందోళన
మెడికవర్ ఆస్పత్రి నిర్వాహాకులు డబ్బుల కోసమే వైద్యం అందజేస్తున్నట్లుగా నాటకమాడారంటూ మృతుడు ప్రభాకర్ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులు రాబట్టుకున్న తర్వాత చనిపోయినట్లుగా చెప్పారంటూ ఆరోపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి మూడు గంటలు చికిత్స అందించారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై వ్యక్తిగత బౌన్సర్ల తో బంధువులపై దాడి చేశారంటూ ఆరోపించారు. మృతదేహం అప్పగించేందుకు రూ. 80వేలు డిమాండ్ చేస్తున్నారంటూ మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా.. విషయం బయటకు రావడంతో సంతకం పెట్టి బాడీని తీసుకెళ్లడంటూ సిబ్బంది రోగి బంధువులకు సమాచారం ఇవ్వడం కూడా మెడికిల్ జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతోంది.
విచారణ జరిగేనా..! డీఎం అండ్ హెచ్‌వో స్పందించేనా..!
మెడికవర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రిలో జరుగుతున్న మరణాలు.. బంధువుల ఆందోళనలపై వైద్య ఆరోగ్య శాఖ తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నా చితక వైద్య శాలలపై తనిఖీల పేరుతో హడావుడి చేసే వైద్య ఆరోగ్య శాఖ పెద్ద ఆస్పత్రుల్లో జరిగే దందాలు.. దౌర్జన్యాలు..మెడికిల్స్‌పై ఎందుకు స్పందించదంటూ జనం నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


