epaper
Monday, March 2, 2026
epaper

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654
వార్డుల‌కు 82, 276
4,236 పంచాయతీలకు కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ
11న తొలి దశ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
ఫ‌స్ట్ ఫేజ్ వివ‌రాలు వెల్ల‌డించిన ఈసీ
రెండో ద‌శ నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం
14వ తేదీన రెండో దశ ఎన్నికల పోలింగ్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకుగాను 25,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,940 మంది తమ పత్రాలు సమర్పించడం విశేషం. అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1న స్వీకరించి, 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ.

రెండో ద‌శ ప్రారంభం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.

నవంబర్ 25న..

నవంబర్ 25వ తేదీ మంగళవారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు.. 1,12,242 వార్డులకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. ఆ రోజు నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్...

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ 16లో 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం 7...

కేసీఆర్‌ను విచారించనున్న సిట్

కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచార‌ణ ఆరంభం ఎర్రవల్లి నుంచి...

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో "కారు" స్పీడ్ పెంచాలి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు...

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి క్యూ లైన్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img