జీవో 46పై బీజేపీ ఆగ్రహం కరీంనగర్‌లో ఆందోళనలు
జీవో ప్రతుల దహనం
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46పై కరీంనగర్ బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తెలంగాణ చౌక్‌లో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో ప్రతులను దహనం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు నాటకాలని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు జీవో 46 ద్వారా వాటిని 22 శాతానికి తగ్గించడం బీసీ సమాజానికి పెద్ద ద్రోహమని విమర్శించారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరగనుందని తెలిపారు. వెంటనే జీవో 46ను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఎన్నికల్లో బీసీలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, గుజ్జ శ్రీనివాస్, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాష్, నరహరి లక్ష్మారెడ్డి, గుంజేటి శివకుమార్, శానగొండ వాసు, నాంపల్లి శ్రీనివాస్, మాసం గణేష్, అవదుర్తి శ్రీనివాస్, తిరుపతి సుధాకర్ పటేల్, హరి ప్రసాద్ పటేల్, ఎడ్ల ప్రసన్న, రంగు సంపత్ గౌడ్, కట్ట రాజు, వొద్నలా కోటేశ్వర్, బోయిని శ్రీనివాస్, పైడి ప్రసాద్, పర్వతం మల్లేశం, బత్తిని మహేష్, అజయ్, నారాయణ, తిరుమల్ రెడ్డి, కచ్చకాయల రాజేంద్ర ప్రసాద్, గుంటుక శంకర్‌తో పాటు మోర్చా నాయకులు, కరీంనగర్ జోన్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


