కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాపట్‌పల్లి.. డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ మెరుగుదల పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు, కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు, మార్గమార్పులు, ఆలస్యాలకు గురికానున్నాయి.
రద్దైన రైళ్లు..
డోర్నకల్–విజయవాడ (ట్రెయిన్ నం. 67767), విజయవాడ–డోర్నకల్ (ట్రెయిన్ నం. 67768), కాజీపేట–డోర్నకల్ (ట్రెయిన్ నం. 67765), డోర్నకల్.. కాజీపేట (ట్రెయిన్ నం. 67766),విజయవాడ – సికింద్రాబాద్ (ట్రెయిన్ నం. 12713),సికింద్రాబాద్ – విజయవాడ (ట్రెయిన్ నం. 12714),విజయవాడ – భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నం. 67215), భద్రాచలం రోడ్ – విజయవాడ (ట్రెయిన్ నం. 67216),గుంటూరు – సికింద్రాబాద్ (ట్రెయిన్ నం. 12705),సికింద్రాబాద్ – గుంటూరు (ట్రెయిన్ నం. 12706), ప్రయాణానికి ముందు రైళ్ల తాజా సమాచారం కోసం రైల్వే ప్రయాణికులు 139 నంబర్‌కి కాల్ చేయాలని అధికారులు సూచించారు.


