కాకతీయ, తెలంగాణ బ్యూరో: బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఇటీవీల ఈడీ టాలీవుడ్ లో పలువురికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తదితరులు విచారణకు హాజరయ్యారు. తాజాగా మంచు లక్ష్మీ కూడా నేడు బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై మంచు లక్ష్మీని ఈడీ విచారించబోతున్నట్లు తెలుస్తోంది


