epaper
Monday, March 2, 2026
epaper

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!
మ‌ళ్లీ ర‌గిలిన సరిహద్దు వివాదం
నేపాల్ వివాదాస్పద నోటుపై భారత్ తీవ్ర ఆగ్రహం
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : నేపాల్ మరోసారి వివాదాల దారిలోకి దూసుకెళ్లింది. భారత భూభాగాన్ని తమదిగా చూపించే మ్యాప్‌తో కూడిన కొత్త రూ.100 నోటును చలామణిలోకి తెచ్చి, ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలను స్పష్టంగా తమ భూభాగంగా గుర్తిస్తూ రూపొందించిన ఈ నోటు, గతంలోనే చర్చలకు దారి తీసింది. అయితే ఈసారి దానిని అధికారికంగా విడుదల చేసి భార‌త్‌తో క‌య్యానికి కాలు దువ్వుతోంది.

కొత్త నోటులో వివాదాస్పద మ్యాప్ కనిపించడంతో భారత్ వెంటనే ప్రతిస్పందించింది. “ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో భౌగోళిక వాస్తవాలు మారవు’’ అని భారత విదేశాంగ శాఖ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దు చర్చలు జరుగుతున్నందున, ఈ సమయంలో నేపాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొంది. సంబంధాలను క్షీణింపజేసే చర్యలుగా ఈ విషయాన్ని భారత్ చూస్తోంది.

ఇది మొదటిసారి కాదు. నేపాల్ గతంలోనే ఈ వివాదాస్పద మ్యాప్‌ను ఆమోదించి, భారత్‌కు ఆందోళన కలిగించింది. కృత్రిమంగా భూభాగాలను విస్తరించుకునే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావు, ఈ ప్రాంతాలు భారతదేశానికి చెందినవేనని అప్పట్లో న్యూఢిల్లీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ ఏడాది మేలో నేపాల్ కేబినెట్ రూ.100 నోటు ముద్రణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా దానిని విడుదల చేయడంతో వివాదం మళ్లీ ముదురింది.

ఈ కొత్త నోటు చలామణిలోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ చర్చలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం వెనుక నేపాల్ అసలు ఉద్దేశ్యం ఏమిటి? సరిహద్దు చర్చలు సాగుతున్నప్పుడు ఇలాంటి టోన్ ఎందుకు? దేశీయ రాజకీయాల్లో జాతీయత్వ జ్వాల పెంచడానికినా? లేక భారత్‌పై ఒత్తిడి చూపించడానికా? ఏ కారణం అయినా, ఈ నోటు విడుదలతో ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img