కాంగ్రెస్ పార్టీ లో చేరికలు
కాకతీయ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం పెద్దా మంగ్యా తండాలో బీఆర్ఎస్కు చెందిన పలువురు కీలక నాయకులు గురువారం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వార్డు సభ్యులు జాటోత్ దేవా నాయక్, యకు నాయక్, లింగా నాయక్, దేవ, మోహన్ నాయక్, రమేష్ నాయక్, శ్రావణ్ నాయక్, కుమార్ నాయక్, పూల్ సింగ్ నాయక్, ధర్మా నాయక్, సుధాకర్ నాయక్‌లు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా ధరించి పార్టీలో చేరారు. పెద్దవంగర మండలం ఆర్సీ తండాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ ఆమ్లా సకృ నాయక్, సీనియర్ నాయకులు భోజ్య నాయక్, నెహ్రు నాయక్ తదితరులు కూడా ఝాన్సి రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరి తమ మద్దతును ప్రకటించారు.


