epaper
Sunday, March 1, 2026
epaper

మేడారం జాతరను విజయవంతం చేద్దాం

మేడారం జాతరను విజయవంతం చేద్దాం
అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్

కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే జనవరి 28న ప్రారంభమై 31 వరకు జరగనున్న మహా మేడారం జాతరను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున మరింత పురోగతిశీల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోటి 50 లక్షల మందికిపైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10 వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. అమ్మవార్ల గద్దల వద్ద మాస్టర్ ప్లాన్ ప్ర‌కారం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.జాతరలో భక్తుల సౌకాల్యం కోసం ఈసారి అదనంగా 5 కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేసి మొత్తం 8 క్యూ లైన్ల ద్వారా దర్శనాన్ని నిర్వహిస్తామని, మూడు గేట్ల ద్వారా బయటికు పంపిణీ చేస్తామని వివరించారు. గత రెండు జాతరాల్లో వచ్చిన అనుభవంతో ఈసారి మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణపై భక్తులకు మైక్ అనౌన్స్‌మెంట్లు, ప్రచార వాహనాలు, నినాదాల ద్వారా అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గంజాయిని అరిక‌ట్టేందుకు నిఘా..!

జిల్లా పరిధిలో గంజాయి విక్రయాలు, చెడు వ్యసనాలు, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. చెడు వ్యసనాలపై కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు. అలాగే అక్రమ ఇసుక, ఎర్ర మట్టి రవాణాపై కఠినంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై పశువులు తిరగకుండా ముందస్తుగా యజమానులకు నోటీసులు జారీ చేసి, వినని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే కార్మికులు, వ్యక్తుల వివరాలను సేకరించడం ద్వారా అనుకోని సంఘటనలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుల కోసం జాతరలో ప్రత్యేక వాహనాలు, గుర్తింపు కార్డులు వంటి సౌకర్యాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. సమస్యలను ప్రజ‌లకు తెలియజేసే క్రమంలో పాత్రికేయులు సూచనలు, సలహాలు ఇవ్వాలని, చిన్న సమస్యలను భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదని చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img