epaper
Monday, March 2, 2026
epaper

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు!

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు!
హాంకాంగ్ తై పో జిల్లాలో సంభవించిన అగ్ని ప్రళయం
13 గంటలు గడిచినా ఆగ‌ని మంటలు
ప్రమాదంలో 4,600 మంది ప్రాణాలు

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : హాంకాంగ్ తై పో జిల్లాలో సంభవించిన అగ్ని తుఫాన్ ప్రపంచాన్నే కుదిపేసింది. వాంగ్ ఫు కోర్ట్ అనే మెగా హౌసింగ్ ఎస్టేట్‌ను అగ్నికీలలు చుట్టుముట్టడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. 44 మంది అక్కడికక్కడే మృతిచెందగా… 279 మంది ఆచూకీ తెలియని పరిస్థితి నెలకొంది. భవనం నుంచి బయటికొచ్చేందుకు వీలుకాక, దట్టమైన పొగలో చిక్కుకున్న కుటుంబాలు సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు శిలా మయమైపోయాయి.

మధ్యాహ్నం 2:51 గంటలకు మొదలైన మంటలు ఒక్కసారి కాదు… గంటల తరబడి ఉధృతమవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 13 గంటలు గడిచినా అగ్నిమాపక సిబ్బంది నియంత్రించలేకపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతోంది. 700 మందికి పైగా ఫైర్మెన్లు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తున్నప్పటికీ… మంటల ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆపరేషన్ మరింత క్లిష్టమైంది.

వాంగ్ ఫు కోర్ట్‌లో మొత్తం ఎనిమిది భారీ బ్లాక్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. పెరిగిన జనసాంద్రత, భవనాల మధ్య తక్కువ గ్యాప్ కారణంగా అగ్నికీలలు ఒక్క భవనంతో ఆగకుండా మిగతా బ్లాక్స్‌కు వేగంగా వ్యాపించాయి. పలువురు కుటుంబాలు తక్షణమే బయటకు రావడానికి వీలు లేక భవనాల్లోనే చిక్కుకుపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించేందుకు వచ్చిన ఫైర్‌ఫోర్స్‌లో ఒకరు మంటల్లో గాయపడి మృతి చెందారు. మరొకరు తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మిగతా సిబ్బంది నిరంతరం మంటలను అదుపుచేసేందుకు పోరాడుతున్నా.. మంటలు మరింత ఉధృతంగా వ్యాపించడం వారి పనిని ఇంకా కష్టతరం చేసింది. అధికారులు ఈ ఘటనను ‘లెవల్ ఫైవ్’గా ప్రకటించారు. ఇది హాంకాంగ్‌లో అగ్నిప్రమాదాలకు ఉన్న అత్యున్నత హెచ్చరిక స్థాయి. ప్రమాద స్థితిని బట్టి పోలీసులు తక్షణమే వెయ్యి మందికి పైగా ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సమీప రోడ్లు మూసివేయడంతో పాటు 30కి పైగా బస్సు రూట్లను మార్గం మార్చారు.

భవనాల వెలుపల మరమ్మతుల కోసం వేసిన వెదురు బొంగులు మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. చిన్న చెలరేగిన అగ్ని, బొంగుల సహాయంతో నిమిషాల్లోనే పెద్ద ప్రమాదంగా మారిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కాంప్లెక్స్ సముద్ర తీరం మరియు ప్రధాన రహదారికి చాలా దగ్గర్లో ఉంది. కేవలం 500 మీటర్ల దూరంలో తై పో రైల్వే స్టేషన్ ఉండటంతో… అత్యవసర సేవల వాహనాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరాయి. అయితే, దట్టమైన పొగ, మంటల వలయం కారణంగా భవనాల్లోకి ప్రవేశించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలను వేగవంతం చేసినా… ఇప్పటికీ వందలాది మంది నివాసితులు కనిపించకపోవడం హాంకాంగ్ మొత్తాన్నీ ఆందోళనలోకి నెట్టింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img