epaper
Monday, March 2, 2026
epaper

2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్‌’ అంటూ దేశం నివాళులు

2008 ముంబై ఉగ్రదాడికి 17 ఏళ్లు: ‘నెవర్‌ఎవర్‌’ అంటూ దేశం నివాళులు
లష్కరే దాడులకు 17 ఏళ్లు
నెవర్‌ఎవర్‌ థీమ్‌తో గేట్‌వే వద్ద ప్రత్యేక కార్యక్రమం
విద్యార్థులతో శాంతి – జాతీయ భద్రత ప్రతిజ్ఞ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : భారత్ ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దారుణ దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ముష్కరులు ముంబైను రక్తపాతం మయం చేసిన ఆ భయానక రాత్రిని దేశం ఇంకా మరువలేదు. అమాయక ప్రజల రక్తంతో నగరం తడిసిన ఆ దుర్ఘటనను ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ దేశం అమరవీరులకు నివాళులు అర్పిస్తుంది.

ఈ సంవత్సరం ముంబైలో ‘నెవర్‌ఎవర్‌(Never Ever) – మళ్లీ ఎప్పటికీ జరగకూడదు’ అనే థీమ్‌తో స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గేట్‌వే ఆఫ్ ఇండియాలో ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉగ్రదాడుల్లో మరణించిన వారి ఫొటోలతో ప్రత్యేక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు భద్రతా బలగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. రాత్రి సమయంలో గేట్‌వేను త్రివర్ణ కాంతులతో అలంకరించడంతో పాటు ‘నెవర్‌ఎవర్‌’ అనే పదాలతో ప్రత్యేక లైట్ షోను కూడా ఏర్పాటు చేశారు. మ‌రోవైపు ముంబై గల వివిధ విద్యాసంస్థల విద్యార్థులతో శాంతి, ఐక్యత, జాతీయ భద్రతపై ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 11 కాలేజీలు, 26 పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకతగా మారింది. యువతలో భద్రతపై అవగాహన పెంపొందించడం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తిప్పికొట్టే నిబద్ధతను బలపరచడమే దీని లక్ష్యం.

కాగా, 26/11 ఉగ్రదాడి భారత భద్రతా వ్యవస్థకు వచ్చిన అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి. 10 మంది ఉగ్రవాదులు కరకచర్‌ సముద్రం నుంచి ఓ ఫిషింగ్ బోట్‌ను హైజాక్ చేసి, భారత తీరానికి సమీపంగా వచ్చి, మరో చిన్న పడవలో ముంబైకి దిగారు. నగరంలోకి వచ్చిన వెంటనే వారు వేర్వేరు గ్రూపులుగా విడిపోయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫే వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పర్యాటకులు, ప్రయాణికులు, ఉద్యోగులు.. ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. 60 గంటలపాటు సాగిన ఈ నరమేథంలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేప‌థ్యంలోనే రంగంలోకి దిగిన NSG కమాండోలు, మారైన్ కమాండోలు, ఆర్మీ యూనిట్లు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ ఆపరేషన్‌లో 9 మంది ఉగ్రవాదులు హతమై, అజ్మల్ కసబ్ మాత్రమే బ్రతికి పట్టుబడ్డాడు. తరువాత అతనికి కూడా ఉరిశిక్ష అమలు చేశారు. అయితే 17 ఏళ్లు గడిచినా 26/11 గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. అమరుల త్యాగాన్ని శిరసావహిస్తూ, భవిష్యత్తులో అలాంటి దుర్ఘటనలు మళ్లీ ఎప్పటికీ పునరావృతం కాకూడదన్న సందేశాన్ని ఈ రోజు దేశం మరోసారి నినదిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img