epaper
Monday, March 2, 2026
epaper

“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది”

“ప్రజలను నట్టేట ముంచేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది”
చింతకుంట విజయరమణ

300 కోట్లు ఖర్చు చేసి కట్టిన చెక్‌డ్యాంలు మూనాళ్ల ముచ్చట
ఎనిమిదింటిలోనూ నాణ్యత జీరో

కాకతీయ, కరీంనగర్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలన్నీ నాణ్యత లోపాలతో వరుసగా కూలిపోతున్న నేపథ్యంలో, ప్రజలను మోసగించేందుకు మాత్రమే ఆ పార్టీ పనిచేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ ఆర్&బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్, ఆరేపల్లి మోహన్ తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ నుండి మంథని, ముత్తారం వరకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎనిమిది చెక్‌డ్యాంలు నాణ్యత లేక వరుసగా కూలిపోతున్నప్పటికీ బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధప్రచారాల్లో మునిగిపోయారని విమర్శించారు. మలహర్, శ్రీరాంపూర్, ముత్తారం, ఓదెల, సుల్తానాబాద్, కరీంనగర్ వరకు నిర్మించిన చెక్‌డ్యాంలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ ఆధారంగానే నిర్మించబడ్డాయని, అవే ఇప్పుడు వరదలకు తట్టుకోలేక వర్షాకాలాల్లో ధ్వంసమవుతున్నాయని చెప్పారు.జమ్మికుంట సమీపంలో గుంపుల,తనుగుల మధ్య 2020లోనే ఒక చెక్‌డ్యామ్ కూలిపోయినప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావే ఉన్నారని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల కోసం కాకుండా ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యాంలు కట్టించుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తీవ్రంగా ఎద్దేవా చేశారు. శ్రీరాంపూర్ మండలంలోని మిర్జాంపేట, రూపునారాయణపేట, వీణవంక, మడక, మల్లారెడ్డిపల్లి, గట్టేపల్లి, నీరుకుల్ల, ఖమ్మంపల్లి ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌డ్యాంలు కూడా వరుసగా కూలిపోయాయని వివరించారు.సిరిసిల్లలో దళితులపై దాడులు చేసి ఇసుక దోపిడీ చేసినది బీఆర్‌ఎస్ నేతల కుటుంబమేనని ఆరోపించారు. కాలేశ్వరం అద్భుతమని చెప్పుకునే వారు టూరిజం ప్లాంట్ అంటూ నిర్మించిన నిర్మాణాలు కూడా ఇప్పుడు కూలిపోయాయని విమర్శించారు. చెక్‌డ్యాంలు పేల్చేశారన్న ఆరోపణలను నిరూపిస్తే ఏది చెప్పినా సిద్ధమని, నిరూపించలేకపోతే హరీష్ రావు రాజకీయాలకు దూరమయ్యే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.తాను ఎమ్మెల్యేగా ఉన్న 2009–14 మధ్య గంగారంలో 14 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఏ మాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని, రానున్న రోజుల్లో ప్రజలు వారి పాలనకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఆరేపల్లి మోహన్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రణవ్, అన్నయ్య గౌడ్, మినుపల ప్రకాశ్ రావు, కర్ర రాజశేఖర్, ఆకుల నర్సన్న, గోపగాని సరయ్య గౌడ్, మూల ప్రేమ్ సాగర్, ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img