జిల్లా కాంగ్రెస్‌కి కొత్త నాయకత్వం
మేడిపల్లి సత్యంను అభినందించిన ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చొప్పదంది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్యంను సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రణవ్, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ బలంగా నిలుస్తోందని, కొత్త జిల్లా నాయకత్వం రావడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని అన్నారు. ప్రజల్లో పార్టీని మరింతగా విస్తరించేందుకు క్రమబద్ధంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గానికి చెందిన పలు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.


