స్వయం సహాయక సంఘాలకు మూడు కోట్ల వడ్డీలేని రుణాలు
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు
కాకతీయ,హుజురాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేశామని నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ నిధుల మంజూరు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, మహిళలు తమ వ్యాపారాలను, స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు.


