రైతులకు అందుబాటులో నిరంతర విద్యుత్
నూతనంగా 33/11 కేవి విద్యుత్ ఉప కేంద్రం
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భూమి పూజ
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం ప్రారంభించారు.శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిఫిసిసి ఉపాధ్యక్షులు ఝాన్సీ రాజేందర్ రెడ్డితోపాటు ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుందని,రైతులకు, చిన్న పరిశ్రమలకు, గృహాలకు పెద్ద ఎత్తున లాభం కలుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఎదుర్కొన్న వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు పూర్తిగా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాకుండా, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల కూడా ముఖ్యమని ఆమె అన్నారు. రైతులకు ఎంతో మేలుకొరకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి ఈ ఉపకేంద్రం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యుత్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆధునీకరణ కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షులు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి సైదులు, సీనియర్ నాయకులు, మాజీ జడ్పి ఫ్లోర్ లీడర్ నెమరుగోమ్ముల ప్రవీణ్ రావు,నెహ్రూ నాయక్, ముత్తినేని శ్రీనివాస్, మల్లికార్జున చారి,రాజు యాదవ్, బండారి వెంకన్న, వెంకన్న నాయక్, హరికృష్ణ, గద్దల వెంకన్న,అనపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



