కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లోని చందానగర్ కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ దుకాణంలో దుండగులు దోపిడికి ప్రయత్నించారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తోంది. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు సిబ్బందికిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలు అయ్యాయి.
మొదట తుపాకీతో బెదిరించిన దుండగులు…సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇచ్చేందుకు నిరాకరించడంతో డిప్యూటీ మేనేజర్ పై కాల్పులకు పాల్పడ్డారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగగొట్టి సిబ్బందిపై దాడి చేశారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పది పోలీసు బ్రుందాలు గాలింపు చేపట్టాయి.


