కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారీ వర్ష సూచన హెచ్చరికను జారీ చేసింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఉత్తర కోస్తాంధ్రతోపాటు దాన్ని అనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


