స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం
కలెక్టర్‌కు బీసీ నేతల వినతి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బీసీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు రఘునాథపాలెం మండలంలో తిరుణాయపాలెం వాసులు వినతిపత్రం అందజేశారు. శాస్త్రీయ పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 54 స్థానాలు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో 571 గ్రామపంచాయతీ సర్పంచులు ఉండగా బీసీలకు కేవలం 54 స్థానాలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రఘునాథపాలెం మండలంలో తిరుణాయపాలెం మండలంలో కనీసం ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బీసీలకు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్, బీసీ సంఘ నాయకులు మేకల సుగుణ రావు, దరిపల్లి వీరబాబు, పిట్టల నాగేశ్వరరావు,యాదాల నాగేశ్వరరావు కొలిచెర్ల గీత కార్మికులు,తదితరులు పాల్గొనడం జరిగింది


