కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. దీంతో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మూడోసారి గెట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సుంకేసుల..36,909, క్యూసెక్కులు, హంద్రీ..5850 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్ ఫ్లో : 1,90,345 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో : 1,74,199 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 882.70 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ , 215.8070 టీఎంసీలుగా ప్రస్తుతం 202.9673 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


