రాజ్ కుమార్ మక్కన్ సింగ్‌ను అభినందించిన మంధేన వెంకటేష్
కాకతీయ,రామగుండం : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ జిల్లా కాంగ్రెస్ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించిన పార్టీ అధిష్ఠానం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మరోసారి నియమించింది.ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ మక్కన్ సింగ్‌ను కలిసి శాలువాతో సన్మానించారు.రెండోసారి అధ్యక్ష పదవి దక్కడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మన్ బాబు, ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్, నాయకులు యాకుబ్ తదితరులు రాజ్ కుమార్ మక్కన్ సింగ్‌కు అభినందనలు తెలిపారు.


