epaper
Monday, December 1, 2025
epaper

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం
దేశం గర్వించదగ్గ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం
డిసెంబర్ 2న ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ
రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కాకతీయ, కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని యూనివర్సిటీ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తదితరులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. వేదిక స్టేజ్ శిలాఫలకం అతిథుల వసతి మీడియా సెంటర్ పార్కింగ్ రాకపోకలు వంటి అంశాల పరిశీలన అనంతరం ప్రతిపాదిత ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వ్యవస్థలో ఎటువంటి లోపం లేకుండా అన్ని శాఖలు పోలీసు విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్ని విభాగాలు చేపట్టాల్సిన బాధ్యతలను శాఖలవారీగా మంత్రి స్పష్టంగా వివరించారు. అనంతరం పత్రికా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
దేశంలో ఇప్పటివరకు లేని ప్రత్యేక సబ్జెక్టులతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ను తెలంగాణ ప్రభుత్వం స్థాపిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో సింగరేణి సంస్థ నిర్వహించిన స్కూల్ ఆఫ్ మైన్స్ ను గుర్తుచేస్తూ, 1996లో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరాన్ని గుర్తించి అధికారిక గుర్తింపుకు కృషి చేసిన విషయాన్ని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం లేమి దృష్ట్యా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సాధారణ విశ్వవిద్యాలయాలకు భిన్నంగా భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ఉపయోగపడే విధంగా దేశ భవిష్యత్తుకు దోహదం చేసే ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో కలిసి ఆరు నెలలపాటు పరిశీలించి సాధ్యతా నివేదిక ఆధారంగా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిందని మంత్రి వివరించారు. ‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’గా నిలిచిన కొత్తగూడెం జిల్లా అరుదైన ఖనిజాల లభ్యతతో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశంగా ఎంపికైందని ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భవిష్యత్ తరాల విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక కట్టుబాటుతో యూనివర్సిటీ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారని మంత్రివర్గం అసెంబ్లీ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనున్నదని చెప్పారు. ప్రజా పాలన చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారు చేసినట్టు ఆయన వివరించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 2న మన జిల్లాకు యూనివర్సిటీ ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్నారని ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్
డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనం, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కె.సుజాత, పాల్వంచ డీఎస్పీ కె.సతీష్, పాల్వంచ తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ :...

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు...

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్...

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి...

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రెటరీ ఎల్....

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత సింగరేణి చైర్మన్ బలరాం గెలుపొందిన విజేతలకు బహుమతులు విజయవంతంగా...

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు ముగిసిన కోల్ ఇండియా...

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు గ్రామపంచాయతీ ఎన్నిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img