రాజకీయ పార్టీలు సహకరించాలి
ఎంపీడీవో : అంజలి
కాకతీయ,నర్సింహులపేట: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో అంజలి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వార్డు నెంబర్లు రిజర్వేషన్ ఎంపికలో భాగంగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం ఆమె మాట్లాడారు.రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో భాగస్వామ్యం కావాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు వినోద్ సుధాకర్,మురళి,సాత్విక్,సాయి రెడ్డి,వెంకటేశ్వర్లు,శివ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


