గీతన్నల రణభేరి పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, పెద్దవంగర : కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేట జిల్లాలో జరిగే బహిరంగ సభకు మండలం నుండి గీత కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్, కార్యదర్శి సమ్మయ్య గౌడ్ పిలుపునిచ్చారు. అదివారం మండలంలోని గట్లకుంట గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సొసైటీ అధ్యక్షులు బండి లచ్చయ్య, సభ్యులు ఎరుకల మల్లయ్య, యాదగిరి, కుమార్,వెంకన్న,శ్రీనివాస్,మహేష్, చరణ్, వెంకటాసోములు,యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.


