బాధితులకు న్యాయంచేయాలి
కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్‌పై నిర్లక్ష్యం
నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలి
కచ్చితంగా న్యాయం చేస్తా..
నా పోరాటంలో కలిసి రావాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కొత్తకోట – కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్ ను 12 ఏళ్లైనా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడి నిర్వాసితులకు వాళ్ల ప్లాట్ల దగ్గరే ఇళ్లు కట్టించాలి. గతంలో 30, 40 మంది పేర్లు మిస్యయ్యాయి. వాళ్ల పేర్లను యాడ్ చేయాలి. అదే విధంగా ఇప్పుడు కొంతమంది ఊర్ల లేకుండా ఉన్నారు. వారికి కూడా న్యాయంచేయాలి. ఇక అప్పుడు 18 ఏళ్లు నిండని వాళ్లకు ఇప్పుడు 18 ఏళ్లు నిండాయి. వాళ్లందరికీ కూడా న్యాయం చేయాలి. మల్లన్న సాగర్, మిడ్ మానేరు, రంగనాయక సాగర్ నిర్వాసితులకు ఎలా న్యాయం చేశారో అలాగే చేయాలి. వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వాలి. అడిగితే గానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం కూడా అడిగితినే వాళ్లు మనకు న్యాయం చేస్తారు. ఎందరో మగ నాయకులు వచ్చి మీకు న్యాయం చేస్తామని మోసం చేశారు. కానీ నేను మహిళా నాయకురాలిని… మీకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. అయితే నేను చేసే పోరాటంలో మీరంతా కలిసి రావాలి. ఇప్పుడు నేను అధికారపార్టీలో లేను. అయినా సరే కొట్లాడి మీకు న్యాయం చేస్తా… అని కవిత అన్నారు.



