ఇంటింటా ఇందిరమ్మ కానుక
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారద అధ్వర్యంలో పంపిణీ..
కాకతీయ నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్వర్యంలో నేడు ఇందిరా మహిళా శక్తి చీరలు మరియు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు తమకు అనుభవం, నైపుణ్యం ఉన్న రంగాలను ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంమే ప్రజల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజలు అభివృద్ది పథంలో ముందు ఉంటారు అని నర్సంపేట నీ అన్ని విధాల అభివృధి చేయడమే నా లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చేసిన 317 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 17 లక్షల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి,ఏపీడీ రేణుకాదేవి,మార్కెట్ ఛైర్మెన్ పాలయి శ్రీనివాస్,పీఏసీఎస్ ఛైర్మన్ రమణా రెడ్డి, పలు మండలాల తహశీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.


