కాకతీయ, గీసుగొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రసిద్ది ప్రఖ్యాతి గాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం మూడో మంగళవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చామంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


