epaper
Tuesday, March 3, 2026
epaper

26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్

26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ముంబయి 26/11 దాడులకు 18 ఏళ్లు పూర్తైన వేళ, వీరమరణం పొందిన భద్రతా సిబ్బంది, నిరపరాధ పౌరులను దేశం స్మరించింది. ఈ సందర్భంగా కులాబాలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే పాల్గొన్నారు. ఫడణవీస్ మాట్లాడుతూ, 26/11 దాడి తాజ్ లేదా ట్రైడెంట్ హోటల్స్‌పై మాత్రమే కాకుండా, భారత సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న పెద్ద ఉగ్రదాడి అని చెప్పారు. ముంబయి ప్రపంచ పెట్టుబడులు, పర్యాటకానికి కేంద్రం కావడంతో ఉగ్రవాదులు నగరాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. తాజ్, ట్రైడెంట్ భారత సామర్థ్యానికి ప్రతీకలు కావడంతో వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను బలహీనంగా చూపాలని ఉగ్రవాదులు యత్నించారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ వైఖరి మారిందని, 26/11 తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని పరోక్షంగా విమర్శించారు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక పాకిస్థాన్ ఉగ్రవాదులను ఆశ్రయిస్తోందని, కొత్త భారత్ దాడికి దాడితోనే సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఉగ్ర ముప్పు ఇంకా కొనసాగుతుండడంతో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని ఫడణవీస్ పిలుపునిచ్చారు. 26/11 సందర్భంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన హేమంత్ కర్కరే, తుకారామ్ ఓంబ్లే తదితర అధికారుల ధైర్యాన్ని స్మరించారు. ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే మాట్లాడుతూ, తాజ్ హోటల్ ఎదుట నిలబడితే అప్పటి అగ్ని, పేలుళ్లు, ప్రజల అరుపుల జ్ఞాపకాలు ఇప్పటికీ కలవరపెడతాయని చెప్పారు. అమర జవాన్ల త్యాగాలను స్మరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని అమృతా ఫడణవీస్ ఆధ్వర్యంలోని దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇరాన్ సూపర్ దాడి చేసిందా..?

ఇరాన్ సూపర్ దాడి చేసిందా..? టెల్ అవీవ్‌పై క్షిపణుల వర్షం హైఫా రక్షణ కేంద్రాలే...

మధ్యప్రాచ్యంలో ఆగ‌ని యుద్ధం

మధ్యప్రాచ్యంలో ఆగ‌ని యుద్ధం ఇరాన్–ఇజ్రాయెల్ పరస్పరం దాడులు సైనిక స్థావరాలే ల‌క్ష్యంగా రెండు దేశాల...

గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు

గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు పూర్తిగా నిలిచిపోయిన గల్ఫ్ దేశాల మార్గాలు వందలాది...

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img