ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ నియామకం
భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడికి కీలక పదవి
నగర అధ్యక్షుడి గా నాగండ్ల దీపక్ చౌదరి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఎఐసీసీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది. వైరా కు చెందిన నూతి సత్యనారాయణను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం నగర అధ్యక్షుడు గా నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి ని నియమించింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు, విశ్వసనీయ అనుచరుడిగా పేరుపొందిన సత్యనారాయణకు జిల్లా పగ్గాలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్లో బలం పెంచే చర్యగా పార్టీ వర్గాలు చూస్తున్నాయి. అదేవిధంగా మాజికేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అనుచరుడు అయిన నాగండ్ల దీపక్ చౌదరి ని నీయమిచడం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.



