మహబూబాబాద్ కాంగ్రెస్‌లో కలకలం
డీసీసీ రాకపోవడంపై వెన్నం అసంతృప్తి
పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో యువ నేత
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన వెన్నం శ్రీకాంత్ రెడ్డికి నిరాశే మిగిలింది. అధిష్ఠానం మాటిచ్చి తప్పిందనే భావనతో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ మండలాలగ్రామాల అధ్యక్షులు,కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కే డీసీసీ పదవీ ఇవ్వాలని ముక్తకంఠంతో బహిర్గతంగా జిల్లా అబ్జర్వర్లకు తెలిపారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే ఏఐసీసీ ప్రకటించిన జిల్లా కమిటీల్లో ఉమా పేరు రావడంపై ఆయన తీవ్ర అసృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీకి కష్టపడ్డ వారిని కాదని పైరవీలకే పెద్ద పీట వేశారని వెన్నం వర్గీయులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వెన్నెముకగా ఉన్నటువంటి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఉన్నత శ్రేణుల పదవుల్లో ఉన్న వారి బంధు మిత్రులకు డీసీసీ పదవులు ఇవ్వబోమని అని స్పష్టం చేసిన కాంగ్రెస్ అధిష్టానం, అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


