మహిళల సాధికారతే లక్ష్యం : ఎమ్మెల్యే సత్యనారాయణ
శంకరపట్నంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : మహిళల సాధికారతకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వెలుగు మండల సమాఖ్య ఆవరణలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి కూడా వడ్డీ లేని రుణాలు విడుదల చేసిందని వెల్లడించారు. డబుల్ బెడ్‌రూం పేరుతో నిరుపేదలను మభ్యపెట్టారని, నిజమైన పేదలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు న్యాయం చేస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపముఖ్యకార్యనిర్వహణాధికారి టి. పవన్ కుమార్, ఎంబిడి ఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ సురేఖ, పీడీ శ్రీధర్, ఏపీఎం శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బస్వయ్యగౌడ్, కొత్తగట్టు దేవస్థానం చైర్మన్ కోరెం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


