దేశభక్తిని రగిల్చిన వందేమాతం
ఘనంగా జాతీయగేయం 150ఏండ్ల ఉత్సవం
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మేయర్ రాజేశ్వర్ రావు
కాకతీయ, వరంగల్ : వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడాదిపాటు వందేమాతరం గేయాన్ని నాలుగు చరణాలు పాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలోని 36వ డివిజన్ చింతల్ ప్రాంతంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు వందేమాతర గేయాన్ని వీనస్ పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులతో కలిసి ఆలపించారు. అనంతరం మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ వందేమాతర గేయం ప్రజల్లో దేశభక్తిని రగిలించిందన్నారు. నరేంద్ర మోదీ పిలుపుతో ఈ గేయాన్ని పూర్తిగా నాలుగు చరణాలతో ఆలపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకట రమణ, జిల్లా నాయకులు బ్యాకం హరిశంకర్, మాచర్ల దీన్ దయాళ్, ఇనుముల అజయ్, కొంతం సంగీత్, శివనగర్ మండల అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, మండల నాయకులు దుస్స శ్రీధర్, నవీన్, బంక రాజ్కుమార్, మునుపటి ఎల్లయ్య, పతి జంపయ్య, మునుపటి నవీన్, జోగు మధు, కొండా మహేశ్వర్, మేడిశెట్టి శివకుమార్, ఆకారపు షేకర్, పుప్పాల శ్రీనివాస్, బల్లనే లోకేష్, భాను, రాజు, గోపగాని శంకర్, వేల్పుల రమేష్, మహమ్మద్ రజియా సుల్తానా, బొజ్జ మురళి, బోళ్ల యాదగిరి, సతీష్, హనంకొండ స్వామి, పెసరు వెంకన్న పాల్గొన్నారు.


