సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత
కాకతీయ, హనుమకొండ : హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న దార కవితను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్‌కు నూతన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న దార కవిత గతంలో వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, సైబర్ నేరాల నియంత్రణలో ప్రత్యేక గుర్తింపు పొందారు. వరంగల్ సెంట్రల్ జోన్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఈ నియామకం ద్వారా దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు.


