లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలి
సిఐటియు మండల కార్యదర్శి జయరాజు
కాకతీయ, ఇనుగుర్తి : కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి జయరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిఐటియు అనుబంధ రంగాల కార్మికులతో మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఏకపక్ష నిర్ణయాలతో కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు అనుకూల విధానాలు అమలు చేస్తూ వాటి స్థానంలో కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులను తెచ్చిందని అన్నారు. ఈ చట్టాల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యాలు లేకుండా కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధానాన్ని బిజెపి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినారు. కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు అల్లపు రాములు, తమ్మడపల్లి సుగుణ, గుజ్జునూరి యాకయ్య, బూర యాకయ్య, గుజ్జునూరి వెంకన్న, రమ, సుంకరి జన్నయ్య, దుంపల రాజయ్య, ఎస్కే అమీర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


