రహదారులతోనే అభివృద్ధి
రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బీటీ రోడ్డుకు శంకుస్ధాపన చేసిన మంత్రి తుమ్మల
కాకతీయ, రఘునాదపాలెం : రహదారులతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో మంచుకొండ నుంచి శివాయిగూడెం వరకు రు. 3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తరపున పుట్టింటి సారే మాదిరి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇంటింటికి వెళ్లి, చీర అందజేయాలని అన్నారు. పండుగలా గ్రామాల్లో చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పన ప్రభుత్వం బాధ్యత అని మంత్రి తెలిపారు. ప్రతి ఇల్లు శుభ్రంగా ఉన్నట్లే ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలని అన్నారు. ఊరు శుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం బాగుంటుందని మంత్రి తెలిపారు. చీడ పీడలు లేకుండా, కోతుల బెడద లేకుండా పామాయిల్ సాగు చేపట్టాలని మంత్రి అన్నారు. పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మిషన్ భగీరథ ఇ ఇ లు పుష్పలత, వాణిశ్రీ, ఎలక్ట్రిసిటీ డిఇ రామారావు, మండల తహసీల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


