వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కిరణ్ కుమార్
కాకతీయ, కొత్తగూడెం: మహిళలు వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో శనివారం సుజాతనగర్లో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశం ప్రభావిత పరిసర ప్రాంత మహిళలు ఆర్ధికముగా ఎదిగి ఉపాధి పొందాలని లక్ష్యంతో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని సక్రమంగా ఉపయోగించుకొని క్రమం తప్పకుండా హాజరై కోర్సు పూర్తి చేసి మంచి శిక్షణ పొంది వృద్దిలోకి రావాలని కోరారు. ఇందులో భాగంగా సుజాతనగర్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతులను ప్రారంభించుకుంటున్నామని అన్నారు.
ఈ వృత్తి శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు “ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ- హైదరాబాద్” వారిచే సర్టిఫికెట్లు కూడా అందచేయబడునని ఈ వృత్తి శిక్షణా కోర్సులు నేర్చుకున్న మహిళలు తాము నేర్చుకున్న వృత్తి శిక్షణ ద్వారా యూనిట్లను నెలకొల్పుకొని తమతో పాటు మరికొందరికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు డిజిఎం(పర్సనల్) కేసా నారాయణరావు, కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, వెల్ఫేర్ పిఏ కే.వరప్రసాద రావు, సేవా కొ ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవాసెక్రెటరీ మాధవీ స్వర్ణలత, కొ ఆర్డినేటర్ పద్మావతి, శిక్షకులు ఇందుమతి ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు.


