epaper
Saturday, January 17, 2026
epaper

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సమితి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.9వేల కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ములుగులో నెలకొన్న అనేక విద్యా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. గిరిజన యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానంను వెంటనే రద్దు చేసి, దేశవ్యాప్తంగా ఒకే విధమైన కామన్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా మహాసభలు డిసెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, పగిడి అన్వేష్, కొండగొర్ల సాయికుమార్, రణదీప్, చెన్నూరు రాంచరణ్, దుర్గం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పొచమ్మకుంటలో హరివిల్లు

పొచమ్మకుంటలో హరివిల్లు రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన...

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాను.. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాను.. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి ములుగు మాజీ జ‌డ్పీటీసీ సకినాల భవాని కాకతీయ,...

ఐన‌వోలు మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న నన్నపునేని దంపతులు

ఐన‌వోలు మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న నన్నపునేని దంపతులు కాక‌తీయ‌, వ‌ర్ధ‌న్న‌పేట : ఐనవోలు గ్రామంలో...

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు... మేడారం పనులపై తీవ్ర విమర్శలు... ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక.... బిఆర్ఎస్...

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం! ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక...

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల...

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా...

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img