ఎన్నికల హామీలను నెరవేర్చాలి
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న
కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఈ నెల 24న మహబూబాబాద్ జిల్లాలో తలపెట్టిన ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటి మూడో ఏటా ప్రవేశించే సందర్భాన డిసెంబర్ 9న సంబరాలు జరుపుకోనున్నది. కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంయుక్త మండలాల కార్యదర్శి చింత నవీన్, సంతోష్, ఎల్లయ్య, కుమారస్వామి, మల్లయ్య, భిక్షం, అబ్బన్న తదితరులు పాల్గొన్నారు.


